ఓటుకు పదివేలు... తండ్రిని సర్పంచ్ గా గెలుపించుకున్న జగదీశ్ రెడ్డి: కవిత

Jagadish Reddy father won Sarpanch Elections
X

Jagadish Reddy father won Sarpanch Elections

సూర్యాపేట: తుంగతుర్తిలో వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. వెలుగుపల్లిలో రుద్రమ్మ చెరువుకు రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని మంత్రులు, ఎంఎల్ల అవినీతిపై దుమ్మెత్తిపోశారు. సూర్యాపేట జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి మండల కేంద్రంలోనే కస్తూర్బా కాలేజీని ఏర్పాటు చేయడంతో 100 పడకల ఆస్పత్రికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు కానీ నిర్మించలేదన్నారు. నూతనకల్ బ్రిడ్జి కూలడానికి సిద్ధంగా ఉందని, త్వరగాతిన పూర్తి చేయాలన్నారు. తుంగతుర్తిలో మిషన్ భగీరథ నీరు 20 రోజుల నుంచి రాక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

సూర్యాపేటలో ఇండ్లు కూల్చారు కానీ పరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కూల్చేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కానీ పరిహారం కోరితే మాకు సంబంధం లేదనడం సబబు కాదన్నారు. సూర్యాపేటలో 300 మంది ఉపాధి కోల్పోయారని, పుల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసేలేదన్నారు. సూర్యాపేటలో సిసి రోడ్లను మొత్తం ఆగం చేస్తున్నారని, సూర్యాపేటలో ఇండ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇంతవరకు పూర్తి చేయలేదని కవిత దుయ్యబట్టారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి దత్తత తీసుకున్న చీదెళ్ళ గ్రామం రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. కలెక్టరేట్ ఊరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దానిని ఊరు మధ్యలో నిర్మించాలన్నారు. సూర్యాపేటలో ఒకప్పుడు కర్నాల చెరువు ఇప్పుడు కబ్జాకు గురైందన్నారు.

చివ్వేంల మండలం ఉండ్రుగొండలో జగదీష్ రెడ్డి అనుచరులు ఆరు ఎకరాల భూమిని కబ్జా చేశారని, ఆటోనగర్ కు 50 ఎకరాలు స్థలం ఇస్తా అని ఐదు ఎకరాల స్థలం కూడా ఇవ్వలేదన్నారు. గతంలో జగదీష్ రెడ్డి తల్లి జ్ఞాపకంగా పాత ఎస్పీ ఆఫీసులో కబడ్డీ పోటీలు జరిగేవని, అప్పుడు ప్రమాదం జరిగి ఒకరు చనిపోగా 26 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఇంతవరకు వారిని జగదీష్ రెడ్డి పట్టించుకోలేదన్నారు. నాగారంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇచ్చి తండ్రిని జగదీష్ రెడ్డి గెలిపించుకున్నారని కవిత ఆరోపణలు చేశారు.

Tags

Next Story