జగద్గిరిగుట్టలో చిన్నారిని నేలకేసికొట్టిన మందుబాబు

X
కూకట్ పల్లి: పెద్దల మధ్య మధ్య గొడవ చిన్నారి ప్రాణం తీసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో జరిగింది. జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతం దేవేందర్ నగర్ లోని కట్ట మైసమ్మ నగర్ లో కృష్ణవేణి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుంది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది. గాలిపోచమ్మ బస్తీకి చెందిన శివ తరచుగా కృష్ణవేణి ఇంటివద్దకు మద్యంతాగి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం కూడా తాగి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో కోపంతో కృష్ణవేణి చిన్న కూతురు వెన్నల (4)ను అమాంతం పైకి లేపి కింద పడేసి కొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్రంగా గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయింది. స్థానికులు శివకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Next Story
-
Home
-
Menu
