మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

Minister Seethakka Slams KTR
X

Minister Seethakka Slams KTR 

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు జిల్లా, ములుగు మండలంలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ఏకగ్రీవమైందని మంత్రి సీతక్క కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సర్పంచ్ పదవికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, గ్రామాభివృద్ధికి ఏకాభిప్రాయం అవసరమని మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు స్థానిక నాయకులు పోటీదారులతో సమాలోచన జరిపారు. ఈ చర్చల ఫలితంగా, కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న అర్రెo వెంకన్న పేరును ఏకగ్రీవ అభ్యర్థిగా ఖరారు చేశారు. తదనంతరం ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడంతో అర్రెo వెంకన్న సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు.

Tags

Next Story