జపాన్‌లో భారీ భూకంపం .. ఎగసి పడిన సునామీ అలలు

X
జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. కోస్తాలో 40 సెంమీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ ప్రధాన హోన్సు ద్వీపంలో ఉత్తర ప్రాంతంలో అయోమోరికి తూర్పు భాగంలో భూకంపం కేంద్రీ కృతమైందని వివరించింది. దీని ప్రభావంతో హొక్కైడో ద్వీపంలో యురాక్వా పట్టణం, ముత్సు ఒగవారా రేవుపట్టణాన్ని సునామీఅలలు 40 సెంమీ ఎత్తున ఎగసి చుట్టుముట్టాయని వివరించింది. హచినోహి పట్ణంలో ఒక హోటల్‌లో సునామీ అలల తాకిడికి అనేక మంది గాయపడ్డారు. అత్యవసరంగా నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ప్రధాని సనాయె తకైచి వెల్లడించారు. ప్రజల ప్రానాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు.
Next Story
-
Home
-
Menu
