మరో అరుదైన రికార్డు సాధించిన బుమ్రా

Jasprit Bumrah
X

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 720/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

ఈ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ జస్ప్రీత్ బుమ్రా తీయగా.. మరో వికెట్ ప్రశిద్ధ్ కృష్ణకు లభించింది. అయితే ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే బుమ్రా వికెట్ తీశాడు. దీంతో ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన భారత బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. గతంలో శ్రీశాంత్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. శ్రీశాంత్ 2006లో వెస్టిండీస్‌పై ఈ రికార్డు నమోదు చేయగా.. జహీర్‌ఖాన్ బంగ్లాదేశ్‌పై 2007లో ఈ ఘనత సాధించాడు. వీరిద్దరి తర్వాత బుమ్రా ఈ లిస్టులో చేరాడు.

Tags

Next Story