జవహర్ నగర్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

జవహర్ నగర్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
X

మేడ్చల్: స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద దీపిక(19) అనే యువతి, అమర్దోయ(15) అనే బాలుడితో స్కూటీపై వెళ్తుండగా వారిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వినాయక మండపం వద్ద జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

Tags

Next Story