అభిషేక్ అందుకు లైసెన్స్ ఇచ్చేశారు..: జయసూర్య

అభిషేక్ అందుకు లైసెన్స్ ఇచ్చేశారు..: జయసూర్య
X

దుబాయ్: ఆసియాకప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత్ ఈ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా.. విజయ పరంపర కొనసాగిండంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ సందర్భంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా శ్రీలంక కోచ్ జయసూర్య అభిషేక్ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌ని కొనియాడారు. భారత క్రికెట్ మేనేజ్‌మెంట్ అభిషేక్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు.

‘‘అభిషేక్ శఱ్మ సహజసిద్ధమైన ఆట ఆడుతున్నాడు. టీం మేనేజ్‌మెంట్ అతడిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఇలా మద్ధతు లభించడం ఎంతో కీలకం. కేవలం వేగంగా ఆడటమే కాదు.. ఎక్కడ తగ్గాలో అతడికి తెలుసు. పవర్‌ప్లే తర్వాత అభిషేక్ కాస్త నెమ్మదిగా ఆడుతున్నాడు. అందుకే ఎక్కువ సమయం క్రీజ్‌లో ఉండగలుగుతున్నాడు. అతడు రోజురోజుకీ ఎక్కువ పరుగులు చేస్తూ.. బ్యాటింగ్‌లో మెరుగవుతున్నాడు’’ అని జయసూర్య అన్నారు. ఇక టీం ఇండియ కోచింగ్ స్టేఫ్ అభిషేక్‌కు సహజసిద్ధమైన ఆట ఆడేందుకు లైసెన్స్ ఇచ్చారని జయసూర్య పేర్కొన్నారు.

Tags

Next Story