జీవన్‌రెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా?

X
జగిత్యాల: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న ఆయన బిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు సమాచారం. గత 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. అయితే రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో ఆయనకు పొసగడం లేదు. సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story
-
Home
-
Menu
