కాంగ్రెస్‌లో కొనసాగలేను.. టి.జీవన్ రెడ్డి లేఖ

Jeevan Reddy
X

జగిత్యాల: సీనియర్ రాజకీయ నేత టి.జీవన్ రెడ్డి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్‌లో కొనసాగలేనంటూ లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు. అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి నెలకొందని.. ఈ నెల 25న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతా అని తెలిపారు. అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రతీ ఒక్కరి తోడు, మార్గదర్శనం కావాలని కోరారు.

Tags

Next Story