అయిజలో అగ్ని ప్రమాదం

అయిజలో అగ్ని ప్రమాదం
X

అయిజ: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో అగ్నిప్రమాదం జరిగింది. అయిజలోని ఓ ప్రైవేటు కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story