అభ్యంతరకర పోస్టులు.. ఢిల్లీ హైకోర్టుకు జూ. ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సోమవారం ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అనుమతి లేకుండా ఎన్టీఆర్ ఫోటో, పేరును వాడిన సోషల్ మీడియా ఖతాలపై, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు న్యాయస్థానం వాయిదా వేసింది. సినీ సెలబ్రిటీలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
కాగా, దేవర మూవీ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంటర్ నేషన్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని ఇటీవల నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. చాలా బక్కగా, గుబురు గడ్డంతో స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమా టైటిల్ తోపాటు పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
-
Home
-
Menu
