చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ కెటిఆర్: కడియం శ్రీహరి

అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కెటిఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెటిఆర్ సభ్యత, సంస్కారం మర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కెటిఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని.. కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. నేను సొంతంగా ఎదిగిన నాయకుడిని అన్నారు. కెసిఆర్ లేకపోతే కెటిఆర్ ఎక్కడ ఉండేవాడో ఆయన ఊహకే వదిలేస్తున్నాను. కెటిఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు.కెటిఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందన్నారు. కెటిఆర్ కు సిగ్గుంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కెటిఆర్ అన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ముందు నీ చెల్లికి సమాదానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
-
Home
-
Menu
