నేను రాజీనామా చేయట్లేదు

ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు
స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధం
నా బ్రాండ్ విలువ ఢిల్లీ వరకు తెలుసు
నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది
కార్యకర్తలు తలదించుకునే పని చేయను
స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
మన తెలంగాణ/స్టేషన్ ఘనపూర్: బిఫాంలు, పదువులు అమ్ముకునే అలవాటు తనకు లేదని, తాను ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయడం లేదని, తన ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలోని ఈఆర్‌ఎల్ గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల దించికునే పని ఎప్పటికీ చేయనని గల్లా ఎగేరుకునేలానే పనిచేస్తానని అన్నారు. స్పీ కర్ నిర్ణయం ఎలా ఉన్నాఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నానని, తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ని యోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ అని, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఢిల్లీ వరకు బ్రాండ్ విలువ బ్రాండ్ కే ఉంటుందని అన్నారు. అందుకు కారణం నిజాయితీగా కచ్చితత్వంలో పనిచేయడమేనని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత గ్రామ స్థాయి నాయకులదేనని, వారిని గెలిపించే బాధ్యత కూ డా గ్రామ నాయకులదేనని స్పష్టం చేశారు. గ్రా మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తు ల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకే అభ్యర్థి పోటీలో ఉండే విధంగా గ్రామ నాయకులు మండల స్థాయి నాయకుల సహకారంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
పాత, కొత్త అనే బేధం లేకుండా అందరూ కలిసి పని చే యాలని కోరారు. గ్రామంలోని మహిళా, యువజన, అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టుకొ ని అందరిని కలుపుకొనిపోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అందరి చూపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వైపే ఉందని, అందరికీ నియోజకవర్గంలో కాం గ్రెస్‌కు తిరుగులేదని నిరూపించాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలను గెలిపించి కానుకగా ఇచ్చి మరిన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ ముఖ్యమేనని అన్నారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ తరపున ఒక్కరికే అవకాశం వస్తుందని, ఇప్పుడు అవకాశం రాలేదని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి చాలా అవకాశాలు వస్తాయని, పార్టీకి విధేయులుగా పనిచేసేవారికి అవకాశం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చని సూచించారు.
ఫలానా వారే అభ్యర్థి అని తాను ఎవరికీ చెప్పానని అభ్యర్థి ఎంపిక నిర్ణయం మీదే... అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా మీదేనని వెల్లడించారు. ఇది మీ ఎన్నికలని పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని సూచించారు. అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 10లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు.
-
Home
-
Menu
