సీనియర్ల వేధింపులు.. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య!

సీనియర్ల వేధింపులు బరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఎమ్మెస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం ప్రకారం.. ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీవిద్య కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక శ్రీవిద్య యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చింది. అయితే, తమ ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసారంటూ పోలీసులకు సీనియర్ల ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీవిద్య.. ఫిబ్రవరి 7న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూతురిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గత పది రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీవిద్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
Home
-
Menu
