కలశ పూజ ఎలా చేయాలి?

kalasa pooja vidhanam in telugu
X

kalasa pooja vidhanam in telugu

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం, శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీళ్ళు వదలాలి.

కలశానికి గంధం, కుంకుమతో బొట్టుపెట్టి కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి.

దేవతీర్థాద్యావాహనము

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర నమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః

కుక్షౌతుసాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః

రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణ:

అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ ...

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !! కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరధీ తివిఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః కలశోదకేన దేవం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య

ఏవమాత్మానంచ సంప్రోక్ష్య

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీద, తమమీద కొద్దిగా చిలకరించుకోవాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమోనమః

ప్రాణప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తోస్తు..

అని గణపతి విగ్రహంపై అక్షతలు వేయాలి.

స్థిరోధవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని అక్షితలు వేసి నమస్కారం చేయాలి.


పువ్వులు రెండు చేతుల్లోకి తీసుకుని..

గణానాంత్వా గణపతిగ్‌ే్మ హవామహే, కవిం క వీనామ్ ఉపమశ్రవస్తవమ్!

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నూతిభిస్సీద సాధనం!!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

పాదయో: పాద్యం సమర్పయామి.. హస్తయో: ఆర్ఘ్యం సమర్పయామి

ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

ఉపచారిక స్నానం.. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు కొద్దిగా గణపతిమీద చల్లాలి.

శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి

స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి,

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్ ధారయామి,

శ్రీ మహాగణాధిపతయే నమః పుప్పై: పూజయామి

శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి

(ధూపం చూపించాలి)

శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి

(దీపం చూపించాలి)

ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి

(హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి)

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్

శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః ఛత్రమచ్చాదయామి

చామరం వీచయామి.. నృత్యం దర్శయామి

గీతామాశ్రావయామి.. వాద్యం ఘోషయామి ..

అశ్వానారోహయామి .. గజానారోహయామి ..

శకటానారోహయామి .. ఆందోళికానారోహయామి ..

అని అక్షితలు వేయాలి

సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి ...

అని నీళ్ళు అక్షితలు పళ్ళెంలో వదలాలి.

శ్రీ మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్నోవరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నుమస్త్వితి భవంతో భ్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు.

మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి

పసుపు గణపతి పూజాక్షతలు శిరసున ధరించాలి.

శ్రీమహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి

శోభనార్ధే క్షేమాయ పునరాగమనాయచ .. అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇక్కడికి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.

వరసిద్ధి వినాయకవ్రత ప్రారంభం..

ఓం శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ: ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు అని మట్టిగణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.

స్వామిన్ సర్వజగన్నాథ యావత్సూజావసానకం

తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు!!

స్థిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద

(అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలు,

పూలు వేసి నమస్కరించాలి)

Tags

Next Story