అక్టోబర్ నుంచి ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ కోసం క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. తొలి భాగం అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.
అంతేకాకుండా రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో నెక్స్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఇది దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. మరింత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చాప్టర్ కోసం నాగ్ అశ్విన్ తెరవెనుక ఇంటెన్స్ వర్క్ చేస్తున్నారు. వరల్డ్, స్కేల్, కథను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభాస్‌తో పాటు ఇతర కీలక నటీనటులు వచ్చే నెల నుంచి తమ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. భారీ షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్లాన్ చేస్తూ మొత్తం ప్రొడక్షన్‌ను 2027 మధ్యలో పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
Home
-
Menu
