ప్రభుత్వ నిస్సహాయతతో కృష్ణా జలాలు ఎపి తరలించుకుపోతోంది: కవిత

X
ప్రభుత్వ నిస్సహాయతతోనే కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజమండ్రిలో తన స్నేహితురాలిని సోమవారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా మనందరం ఎప్పుడూ కలిసుండాలనేదే తన అభిమతమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపిణీ, ఇతర ఏ అంశాల విభజన చట్టంలో ఉన్న అంశాల ప్రకారమే జరగాలని సూచించారు. నీటి పంపకాల విషయంలో విభజన చట్టం, ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ సూచించే విధానాల ప్రకారం నడుచుకోవాలని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని కోరారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలంటే కృష్ణా జలాల పంపిణీ అత్యంత సామరస్యపూర్వకంగా, నిబంధనల ప్రకారమే జరగాలని అన్నారు.
Next Story
-
Home
-
Menu
