పూలమ్మి, పాలమ్మి వందల ఎకరాలు కబ్జా పెట్టిండు!

మేడ్చల్ జిల్లా మేడిపండు చందంగా ఉందే తప్పితే ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్న కవిత సోమవారం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మేడ్చల్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు పెరెన్నికగన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, డిఫెన్స్, ఎరోనాటిక్స్ లాంటి సంస్థలు, ఫార్మా కంపెనీలకు నెలవుగా ఉన్నా జిల్లాలోని అన్ని బస్తీలు, కాలనీలో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని అన్నారు. జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నోచుకోలేదని గుర్తు చేశారు.
జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా బీటి బ్యాచ్ అని, ఉద్యమకారులు లేరని, ఉన్న ఒక్క శంభీపూర్‌రాజుకు మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారని, మిగతా వారంతా అధికారం, డబ్బు సంపాదన , భూముల ఆక్రమణ కోసమే వేరే పార్టీలో గెలిచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ భజన చేయడం అలవాటు చేసుకున్నారని కవిత విమర్శించారు. కుత్బుల్లాపూర్ ఇప్పుడు కబ్జాల పూర్‌గా మారిందని స్థానికులు అంటున్నారని కవిత ఆరోపించారు. మేడ్చల్‌లో మల్లారెడ్డి పూలమ్మిన, పాలమ్మిన అని డైలాగులు చెబుతూ వందల ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడలు గొట్టి ఇప్పుడు మనువడితో రేవంత్‌రెడ్డి కాళ్ళుమొక్కించి సెటిల్‌మెంట్ చేసుకున్నాడని ఆరోపించారు.
-
Home
-
Menu
