పత్తి రైతుల పరిస్థితి ఘోరం:కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha on cotton farmers
రాష్ట్రం లో పత్తి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించాలని జన జాగృతి అ ధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తాను చేపట్టిన జాగృతి జనం బాటలో భాగంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్ళు జరుగుతున్న తీరును ఆమె సోమవారం ప రిశీలించారు. రైతులకు మేలు చేసేలా సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలా దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదించారు. ఈ విషయమై కేం ద్రప్రభుత్వంతో మాట్లాడతానని రైతులకు భరోసా ఇచ్చారు. తేమ శాతం పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆదిలాబాద్ ఎంపి, ఎంఎల్‌ఎ, బిజెపికి చెందిన వారు ఉన్నా పత్తి రైతులను ఆదుకునే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పత్తి రైతులను చూస్తుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బ్రిడ్జిని వెంటనే పూర్తి చే యాలని, ఇందుకు ఎంపి, ఎంఎల్‌ఎ చొరవ చూ పాలని అన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రం లోని ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీం విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆమె వెంట ఆదిలాబాద్ జాగృతి అధ్యక్షుడు శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.
-
Home
-
Menu
