గొప్పలు చెప్పిన రుద్రమ చెరువు రిజర్వాయర్ ఎక్కడ?: కల్వకుంట్ల కవిత

గొప్పలు చెప్పిన రుద్రమ చెరువు రిజర్వాయర్ ఎక్కడ?: కల్వకుంట్ల కవిత
X

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఉన్న రుద్రమ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని గత ప్రభుత్వం రెండు ఎన్నికల్లో హామీలు గుప్పించి నేటికీ ఆచరణలో పెట్టకపోవడంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా వెలుగుపల్లిలోని రుద్రమ చెరువును జాగృతి జిల్లా అధ్యక్షురాలు సూరారపు కృష్ణవేణి, నాయకులతో కలిసి శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. బిఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం ఆ నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఈ చెరువు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, సుమారు ఒక కిలోమీటర్ నర మేర కాల్వను తవ్వితే గోదావరి జలాలు ఈ చెరువులోకి వస్తాయని అన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద

పదేండ్లు పరిపాలించిన బిఆర్‌ఎస్ గాని, రెండేళ్లుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిధులు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఆయకట్టులోని రైతన్నలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గ ఎంఎల్‌ఎగా ఎన్నికైన సామెల్ పలు దఫాలుగా ఈ చెరువును పరిశీలించి రిజర్వాయర్ చేస్తానని, లక్నవరం చేస్తానని చెప్పడం తప్ప చేసింది లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్లను కట్టే విధంగా చొరవ చూపాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం ఎందుకు?

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఆగిపోయిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం నియోజకవర్గ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా కెసిఆర్ 30 పడకల ఆసుపత్రిని వంద పడకలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు నాడు శంకుస్థాపన చేయగా.. తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే సామెల్ రెండుసార్లు శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టారని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, లేదా కాంట్రాక్టర్‌కు సరైన సమయంలో నిధులు రాక ఈ భవనం అర్ధంతరంగా ఆగిపోయిందని అన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణం సంవత్సరాలు గడుస్తున్నా పూర్తికాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఆస్పత్రి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు సరైన వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వైఖరి మారాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించి, మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో మారోజు వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు.

Tags

Next Story