మూడో ముఖ్యమంత్రిని నేనే: కల్వకుంట్ల కవిత

మూడో ముఖ్యమంత్రిని నేనే: కల్వకుంట్ల కవిత
X

2009లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి పొత్తులో భాగంగా నేను ఇక్కడికి వచ్చానని.. కోస్గికి రావడం రెండోసారి అని టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు..రేవంత్‌రెడ్డి సిఎం అయిండని.. ఇప్పుడు మూడో వ్యక్తి గా నేను పాలమురు జిల్లా బిడ్డల మద్దతుతో ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకం ఏర్పడిందని ఆమె అన్నారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలోని కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసి పాంచజన్య సంకల్ప బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి తలరాతలు మారలేదని, వలస బతుకులు మారలేదన్నారు. పాంచజన్యం అంటే 5 హామీలతో ముందుకు వస్తున్నానని, ఆశీస్సులు అందించి గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలో మొదటి తరగతి నుంచి ఉచితంగా చదువు చెప్పిస్తానని, ఏ ప్రైవేట్ ఆసుపత్రికి ఆడబిడ్డలు వెళ్లినా ఉచితంగా వైద్య సేవలు అందిస్తానన్నారు.

తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రాజెక్ట్‌లు పూర్తి కాలేదని అన్నారు. నిన్న రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద రెగ్యులేటర్లు పగులగొట్టి నీళ్లు విడుదల చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, యూరియా కోసం కాళ్లు పట్టుకోవాలనా అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు అరిఘోస పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి అల్లుడి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం లగచర్లలో లంబాడి మహిళాలపై దాడులు చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మేము అడిగితేనే అజారుద్దీన్‌కు క్యాబినెట్‌లో స్థానం కల్పించారని.. లంబాడి వర్గాలకు క్యాబినెట్లో స్థానమే లేదన్నారు. నేను కాంగ్రెస్ విడిచిన బాణమని ఒకరు.. కెసిఆర్ విడిచిన బాణమని మరొకరు అన్నారన్నారు. బిజెపి విడిచిన బాణమని ఇంకొకరు అన్నారన్నారు. నేనే తెలంగాణ బహుజనుల బాణమని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు, కేటీ దొడ్డు మండలాల్లో అక్షరాస్యత ఆఫ్ఘనిస్థాన్ కంటే తక్కువ ఉందని... ఇది ఇంకా సిగ్గు చేటన్నారు.

కొడంగల్ నియోజకవర్గంలోనే 47 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందని.. ఇంజినీరింగ్ కళాశాల వాపసు పోయిందన్నారు. పాలమూరు జిల్లాలో దోపిడీ జరుగుతోందన్నారు. కొడంగల్ లో కూడా ఇల్లు కట్టు కోవాలి అంటే లంచం ఆడుతున్నారని ఆరోపించారు. కవిత ప్రసంగం మొదలు కాగానే సిఎం..సిఎం అనే నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిలింది. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు,కొడంగల్ నాయకులు,కార్యకర్తలు పాల్లొన్నారు.

Tags

Next Story