కల్వకుర్తిలో అత్తపై అల్లుడు అత్యాచారం... చంపేసి

Vijayawada Panja Center
X

Vijayawada Panja Center

కల్వకుర్తి: మద్యం మత్తులో అత్తపై అల్లుడు అత్యాచారం చేసి అనంతరం ఆమెను చంపేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన కూతురును తిమ్మాజీ పేట మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసింది. కానీ అల్లుడు మద్యానికి బానిసగా మారి కూతురును వేధించడం మొదలు పెట్టాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో అల్లుడిని ఇల్లరికం తెచ్చుకొని ఇద్దరిని పోషిస్తోంది. దంపతులు గొడవలు తగ్గకపోగా తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను వదిలి తన బంధువుల ఇంటికి భార్య వెళ్లిపోయింది. ఇంట్లో అత్త ఒంటరిగా ఉండడంతో ఆమెపై అల్లుడు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story