ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

X
భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్ రూట్‌లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి, తాత ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, తల్లి ఘటనాస్థలం లోనే మృతి చెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ వారు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
