కాపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని పత్తి రైతులు ఆందోళన

Cotton Farmers Protest
X

Cotton Farmers Protest

కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలను కష్టాల పాలు చేస్తుందని తేమ శాతంతో పాటు కొత్తగా కాపాస్ కిసాన్ ఆప్ ప్రవేశంతో సమస్యలకు తెర లేపిందని పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. నేరడిగొండ రైతుల వద్ద కొనే పత్తి పంట కొనుగోలు లో తేమ శాతాన్ని పెంచి తీసుకోవాలని మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు.రాకపోకలను స్థభింప చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యత రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షులు ఆడే వసంత్ రావు మాట్లాడుతూ పత్తి లో తేమ శాతాన్ని 12 నుండి 20 శాతానికి పెంచి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని, సోయాబీన్ తేమశాతాన్ని ఎనిమిది శాతం

నుండి 18 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కాపాస్ కిసాన్ ఆప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి,తేమ శాతం పేరుతో సీసీఐ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కఫాస్ కిషన్ యాప్ సమస్యలు తప్పడం లేదని వెంటనే కపాస్ కిషన్ యాప్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిసిఐ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో మండల రైతులు నాయకులు పాల్గొన్నారు.

Tags

Next Story