కరీంనగర్ లో ఎస్ఐ ఆత్మహత్య

X
కరీంనగర్: ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేటలో జరిగింది. అత్తగారింట్లో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
Next Story
-
Home
-
Menu
