ఆ పని చేశాడని... ప్రియుడిని చంపిన ప్రియురాలు

ఆ పని చేశాడని... ప్రియుడిని చంపిన ప్రియురాలు
X

బెంగళూరు: ప్రియుడిని హత్య చేసిన కేసులో ప్రియురాలుతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బాగుటకంఠే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్వశి అలియాస్ సింధు అనే యువతికి మోహన్ కృష్ణ అనే ప్రియుడు ఉన్నాడు. దంపతులమని విజయలక్ష్మీ అపార్ట్ మెంట్ లో అద్దె తీసుకొని నివసిస్తున్నారు. కృష్ణకు భార్య ఉండగా ఊర్వశికి భర్త ఉన్నాడు. కానీ ఇద్దరు తమ కుటుంబాలను వదిలిపెట్టి సహజీవనం చేస్తున్నారు. ఊర్వశి మరో ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం ఉందని పలుమార్లు ఆమెను వేధించాడు. వేధింపులు ఎక్కువగా కావడంతో కృష్ణను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఇంట్లోనే వినయ్, ధనుష్ అనే యువకులతో ప్రియురాలు తన ప్రియుడిని హత్య చేసింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags

Next Story