సిమెంట్ లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసి బస్సు

X
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు వద్ద మరో కర్ణాటక ఆర్టీసి బస్సుకు ప్రమాదం జరిగింది. కరణ్ కోట్ సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని కర్ణాటక ఆర్టీసి బస్సు ఢీకొంది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ కు స్వల్ప గాయాలవ్వగా, ఓ ప్రయాణికుడికి తలకు గాయం అయింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాలను పక్కకు పోలీసులు తొలగించారు. బస్సు ప్రమాదాలు ఒకదానికొకటి వరుసగా జరుగుతుండడంతో తీవ్రంగా ఆశ్చర్యానికి, ఆవేదనకు గురిచేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Next Story
-
Home
-
Menu
