ఖాతా తెరిచిన కవిత

ఖాతా తెరిచిన కవిత
X

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖాతా తెరిచారు. కవిత అనుచరులు ఏకంగా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 స్థానాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకుంది. కవిత మద్దతుదారులు ఎఐఎఫ్ బి గుర్తు సింహంపై పోటీ చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

కార్పొరేషన్లలో కాంగ్రెస్ నాలుగింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 56 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. మున్నిపల్ వార్డులలో కాంగ్రెస్ 855 , బిఆర్ఎస్ 441, బిజెపి130, ఇతరులు 124 స్థానాలలో గెలుపొందారు.

Tags

Next Story