ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కెసిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్‌కు బయలుదేరారు. కెసిఆర్ రాకనేపథ్యంలో ఆయన అభిమానులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కెసిఆర్ కాన్వాయ్ పై పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా వేలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులపై నినదిస్తూ నిరసనలు తెలిపారు. రోడ్డు మార్గంలో అభిమానులకు కెసిఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వందలాది వాహనాల్లో కెసిఆర్ వెంటనే నందినగర్‌కు బిఆర్‌ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. 12.30 నిమిషాలకు ఆయన నందినగర్‌కు చేరుకునే సిట్ విచారణకు హాజరుకానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ సిఎం కెసిఆర్‌కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగానే కెసిఆర్‌కు నోటీసులు ఇచ్చారని, ఫోన్ ట్యాఫింగ్‌కు కెసిఆర్‌కు సంబంధం లేదని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారని, ఇది మరొక ఫేక్ కేసు అని బిఆర్‌ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు.
-
Home
-
Menu
