కుటుంబ సభ్యుడిలా కలిసిపోయాడు.. మణికుమార్ మృతిపై కెసిఆర్ భావోద్వేగం!

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
మణికుమార్ మరణవార్త తెలుసుకున్న కెసిఆర్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కెసిఆర్, ఆయన సతీమణి శోభ, మాజీ మంత్రి కెటిఆర్ మణికుమార్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కెసిఆర్ స్పందిస్తూ.. మణి తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మణికుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని ముస్తాబాద్ మాజీ జడ్పీటిసి శరత్‌రావుకు కెసిఆర్ సూచించారు.
Tags
-
Home
-
Menu
