ఫోన్ ట్యాపింగ్ కేసు: ముగిసిన కెసిఆర్ సిట్ విచారణ..

X
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిట్ విచారణ ముగిసింది. నందినగర్‌లోని నివాసంలో కెసిఆర్‌ని సిట్ అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటలపాటు సిట్ అధికారులు కెసిఆర్‌ను ప్రశ్నించారు. సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయరెడ్డి, శ్రీధర్, కెఎస్ రావు ఈ విచారణలో పాల్గొన్నారు. కెసిఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు. ఈ కేసులో కెసిఆర్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు సంబంధిత డాక్యూమెంట్లు, ఇతర ఆధారాలతో సిట్ అధికారులు నందినగర్‌లోని నివాసాన్ని విడిచి వెళ్లారు.
Next Story
-
Home
-
Menu
