తొలి వివాహ వార్షికోత్సవం..స్పెషల్ వీడియో పంచుకున్న కీర్తి సురేష్

తొలి వివాహ వార్షికోత్సవం..స్పెషల్ వీడియో పంచుకున్న కీర్తి సురేష్
X

తన స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంథోనీతో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం గత ఏడాది డిసెంబరు 12న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జరిగి ఏడాది పూర్తయింది. తమ వివాహ తొలి వార్షికోత్సవం సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేశ్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. పెళ్లి వేడుక మధుర జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకుంది. కీర్తి పెళ్లి వేడుక ఎంత సందడిగా, ఘనంగా జరిగిందో ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియాలో కీర్తి సురేష్ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను మైమరపించింది.


Tags

Next Story