నకిలీ తుపాకీతో బెదిరించి.. నగల షాపులో చోరీకి యత్నం

X
కీసర: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ దుండగుడు నగల దుకాణంలో చోరీకి యత్నించాడు. తుపాకీతో బెదిరించి ఈ దారుణానికి ఒడగట్టాడు. నాగారం సత్యనారాయణ కాలనీలోని బాలాజీ జ్యూవెలర్స్‌లో దోపిడీకి వచ్చిన దుండగుడు వ్యాపారిని తుపాకీతో బెదిరించాడు. వ్యాపారీ ప్రతిఘటించడంతో దుండగుడు తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న కీసర సిఐ ఆంజనేయులు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనస్థలంలో పడి ఉన్న నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
