లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన కీసర ఎస్‌ఐ..

X
ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు ఎస్ఐ దొరికిపోయాడు. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ పట్టుబడినట్లు సమాచారం. ఒక కేసులో చార్జ్‌షీట్ వేయడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ శ్రీనివాస్, అదే మొత్తాన్ని లంచంగా తీసుకుంటు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. నాగారం శిల్పా నగర్ లో డబ్బులు తీసుకుంటగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
