హీరోయిన్ పై లైంగిక దాడి కేసు.. దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించింన కోర్టు

హీరోయిన్ పై లైంగిక దాడి కేసు.. దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించింన కోర్టు
X

న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దాదాపు ఎనిమిది సంవత్సరాలు కొనసాగిన ఈ కేసు తుది తీర్పును కోర్టు వెల్లడించింది. ఎట్టకేలకు ముగిసింది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న దిలీప్ ను న్యాయమూర్తి హనీ ఎం వర్గీస్ నేతృత్వంలోని ఎర్నాకుళం జిల్లా, ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిర్దోషి అని తేల్చింది.

ఫిబ్రవరి 17, 2017న కొచ్చిలో నటుడు దిలీప్.. ఓ ప్రముఖ నటిని తన కారులో అపహరించి లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను కారులో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత నటి ఫిర్యాదుతో పోలీసులు నటుడు దిలీప్ లో సహ 10 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్, లైంగిక దాడి, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ముగిసింది.


Tags

Next Story