ఇంకా ప్రారంభం కాని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

ఇంకా ప్రారంభం కాని  ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
X

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఏటా కంటే ఆలస్యంగా ప్రారంభకానుంది. 6.30 కి ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర ఇప్పటి వరకు ముందుకు కదలడం లేదు. బడా గణేష్ ను లిఫ్ట్ చేసే హైడ్రాలిక్ క్రేన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో శోభాయాత్ర ఆలస్యం కానుంది. అనుకున్న సమయానికంటే ఇప్పటికే రెండు గంటలు ఆలస్యమైంది. ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభానికి మరో గంట పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే భక్తులు ఖైరతాబాద్ కు భారీగా చేరుకున్నారు. ఖైరతాబాద్ పురవీధుల్లో భక్తులు పెరిగితే శోభాయాత్ర మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆ ర్ మార్గ్ (ట్యాంక్ బండ్) మీదుగా హుస్సేన్ సాగ ర్ వద్ద అదనపు క్రేన్‌లు, ప్రత్యేక ప్లాట్ ఫారంలు ఏర్పాటుచేయడంతో పాటు క్రేన్ నంబర్- 5 వద్దకు భారీ గణపయ్య చేరుకుంటారు. అక్కడే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయనున్నారు.


బాలాపూర్ వినాయకుడిని అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రెండు గణపయ్యల నిమజ్జనం మధ్యాహ్నానికి పూర్తి చేయగలిగితే నిమజ్జనం సింహాభాగం పూర్తైనట్టేనని అధికారులు భావిస్తున్నారు. నిమజ్జనం శుక్ర, శనివారాలతో పాటు ఆదివారం మధ్యాహ్నాం వరకు సాగుతూనే ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. సీఎంసీ, ఎంఎంసీల్లో శనివారం ఉదయానికల్లా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలున్నాయి.


Tags

Next Story