ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఫ్రారంభం

ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఫ్రారంభం
X

హైదరాబాద్: మహానగరంలో గణేషుల నిమజ్జనం కొలాహలంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేషుడిని చూడటానికి భక్తులు తండోపతండాలు తరలి వచ్చారు. హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక నిమజ్జన కార్యక్రమ వేదికగా నిలిచిన హుస్సేన్ సాగర్ చుట్టూర 40 భారీ క్రేన్లను ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్లలో 5వ నెం బర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది.


23వ తేదీ బుధవారం అర్ధరాత్రితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలను నిలిపివేవారు. 24 గు రువారం నాడు షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు, ని మజ్జన ఏర్పాట్లు చేపట్టారు. గురువారం సాయం త్రం నుంచే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ఏ ర్పాట్లు మొదలయ్యాయి. నేడు (శుక్రవారం) తెల్లవారు జామున 4 గం.లకు భారీ గణపయ్యను ప్ర త్యేక టస్కర్‌పైకి ఎక్కించేలా ఏర్పాట్లను అధికారు లు ప్రారంభించారు.ఖైరతాబాద్ నుండి ఎన్టీఆ ర్ మార్గ్ (ట్యాంక్ బండ్) మీదుగా హుస్సేన్ సాగ ర్ వద్ద అదనపు క్రేన్‌లు, ప్రత్యేక ప్లాట్ ఫారంలు ఏర్పాటుచేయడంతో పాటు క్రేన్ నంబర్- 5 వద్దకు భారీ గణపయ్య చేరుకుంటారు. అక్కడే ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయనున్నారు.

Tags

Next Story