గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి... నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ముగిసింది. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణపతి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వైపు ఏర్పాటు చేసిన 5వ నెం బర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ భారీ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసరదాల్లో డప్పులు, నృత్యాలతో గణకనాధులు తరలివెళ్తున్నాయి. పండ్లు,పూలతో అలంకరించిన వాహనాల్లో గణేశుడి శోభయాత్ర జరుగుతోంది.
గణేష్ నిమజ్జనాన్ని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తో పాటు అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎప్ఒ జయప్రకాష్, ఎస్ఎఫ్ఒ చంద్రశేఖర్ బాబు కూడా ప్రత్యేక నిమజ్జన పూజల్లో పాల్గొన్నారు. ఎన్ టిఆర్ మార్గంలోని హైడ్రా కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని పరిశీలించారు. హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించడంతో పాటు నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు.
-
Home
-
Menu
