అతి వేగం.. రెయిలింగ్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

అతి వేగం.. రెయిలింగ్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
X

ఖమ్మం: జిల్లాలోని కల్లూరు మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లాకు చెందిన సాయి మహేష్(35), గట్టు రాంబాబు(39) శుక్రవారం ఖమ్మం వెళ్తుండగా.. లింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. వారు బైక్‌పై అతి వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొన్నారు. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Tags

Next Story