నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో ఘరానా మోసం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌ల పేరుతో ప్రజలను మోసం చే స్తున్న అంతర్జాతీయ స్థాయి సైబర్ ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. నకిలీ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ నెట్‌వర్క్‌ను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందా లు ఛేదించాయి. ఈ కేసులో ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బాట్ బ్రో, వైఎఫ్‌ఎక్స్, మినీ క్రిప్టో, బిట్ నోవా, క్యూఎఫ్‌ఎక్స్ వంటి పేర్లతో రూపొందించిన యాప్‌ల ద్వారా ఈ ముఠా ప్రజలను ఆకర్షించింది. నెలకు 9 నుంచి 10 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికి పెట్టుబడులు సేకరించారు. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వ అనుమతి లేని నకిలీ ఎమ్‌ఎల్‌ఎం స్కీమ్‌లని పోలీసుల దర్యాప్తులో తేలింది.పలు మార్కెటింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా అమాయక ప్రజల వద్ద నుండి భారీ స్థాయిలో పెట్టుబడులు సేకరించి భారీ మోసానికి పాల్పడారు. బాట్ కంపెనీ ,దాని ఏజెంట్లు ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నెలకు ఖచ్చితమైన లాభాలు వస్తాయని హామీ ఇచ్చి వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న ఐదుగురు ప్రధాన ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం నగరంలోని ఖానాపురం కుచెందిన భుక్య శ్రీధర్ నాయక్ (28) ,కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఉపేందర్ (37) ,నీలకంఠం సిద్ధు (32), కారేపల్లి మండలానికి చెందిన వంకుడ్యత్ సురేష్ (29) , మరికొందరు మధ్యవర్తులపై చీటింగ్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిపాజిటర్స్ యాక్ట్ , ఐటీ యాక్ట్ 2008 నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు.
దుబాయ్ నుంచే కుట్ర
ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి దుబాయ్ కేంద్రంగా ఉన్న లవిష్ చౌదరి అలియాస్ నవాబ్ అలీ అని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గజేంద్ర సింగ్, దీపక్ యాదవ్, ప్రిన్స్ గుప్తా, ప్రమోద్ మౌర్య, వికాస్ మౌర్య తదితరులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ఐదుగురు ఏజెంట్లు ఇప్పటివరకు రూ.2,73,43,440 అక్రమంగా సంపాదించినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బుతో వారు తమ కుటుంబ సభ్యుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ లో ఇంకా పలువురు స్థానిక ఏజెంట్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నియమించినట్లు పోలీసులు తెలిపారు దుబాయి కి చెందిన బాట్ వ్యవస్దాపకులు లావిష్ చౌదరి ,ఢిల్లీకి చెందిన గజేంద్ర సింగ్,దీపక్ యాదవ్,ప్రిన్స్ గుప్తా,సందీప్ నర్వాల్, ఉత్తర్ ఫ్రదేశ్ లోని మొరాదాబాద్ ప్రాంతానికి చెందిన యశ్ దేవ్ శైనీ, పంజాబ్- చండీగఢ్ కు చెందిన ప్రమోద ప్రమోద్ మౌర్య ,వికాస్ మౌర్య,వివేక్ పటాన్ నిందితులను పట్టుకోవాల్సి ఉంది.
అయితే సదరు నిందితులు తరచుగా పేర్లు, ప్లాట్ఫారమ్లు మారుస్తూ, దుబాయ్ లో ఉన్న ప్రధాన సూత్రధారులతో కలిసి అక్రమ ఎంఎల్‌ఎం(మల్టీ లెవల్ మార్కటింగ్ ) స్కీమ్ , అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్ లను నడిపించి తద్వారా ప్రజల వద్ద నుండి బారి పెట్టుబడులు సేకరిస్తూ మోసం చేస్తున్నారని ఖమ్మం నగర ఏసిపి ఎస్ వి రమణమూర్తి తెలిపారు.ఈ నేరములో ఇతర ఏజెంట్లను గుర్తించి, విదేశాల్లో ఉన్న సూత్రధారులను చట్టపరంగా పట్టుకునేందుకు మరింత దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. బాధితుల వివరాలు సేకరించి మరిన్ని కేసులు నమోదు చేస్తామని వారు చెప్పారు. ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ వి రమణ మూర్తి పర్యవేక్షణలో, ఖానాపురం హవేలి ఇన్స్పెక్టర్ భాను ప్రకాశ్ ఆధ్వర్యంలో కేసు ధర్యాప్తు కొనసాగుతుంది ప్రజలంతా అన్ లైన్ ట్రెడింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టి ముందు సంబంధిత స్కీమల విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధిక లాబాలు ఇస్తామని చెప్పి ఆఫర్లకు మోసపోవద్దని, అనుమానాస్పద పెట్టుబడి పథకాలను వివరాలు తెలసి ఉంటే అట్టి వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు
-
Home
-
Menu
