ఖమ్మం నడిబోడ్డున యువతిని పొడిచి పొడిచి హత్య

X
Killa Brahmin Bazaar Khammam
మన తెలంగాణ/ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో యువతిని దారుణంగా హత్య చేశారు. ఖిల్లా బ్రాహ్మణ బజార్ సమీపంలో యువతి దారుణంగా పొడిచి చంపేశారు. పాల్వంచ పట్టణానికి చెందిన యువతి ఖమ్మంలోని ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తూ, పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ లో నివసిస్తోంది. కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన చెందిన మహిళను దుండగుడు అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. మహిళ మృతదేహాన్ని చూసి వన్ టౌన్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహం సమీపంలో కొంత నగదు పడి ఉండటంతో నగదు కోసం చేశారా, యువతిని ఎవరైనా వేధిస్తూ చంపారా అన్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
