తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: కిషన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: కిషన్ రెడ్డి
X

హైదరాబాద్: దశాబ్ద కాలంగా భారత్ కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పదేళ్లుగా అన్ని రంగాల్లో ఈ అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని తెలియజేశారు. పదేళ్లలో ఎయిర్ పోర్టులు రెండింతలయ్యాయని, జాతీయ రహదారులు 60 శాతం ఎక్కువై లక్షా 46 వేల కి.మి. చేరుకున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రస్తుతం రెండోస్థానంలో ఉందని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. కేంద్రం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారితనం వల్లే పెట్టుబడులు పెరిగాయని, గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్ గా భారత్ మారిందని కొనియాడారు. గత దశాబ్దకాలంగా భారత్ లో ఎన్ హెచ్ ల నిర్మాణం 70 శాతం పెరిగిందని, పదేళ్ల క్రితం 240 కి.మి. ఉన్న మెట్రో రైల్ నెట్ వర్క్ ఇప్పుడు 1013 కి.మి. పెరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Next Story