ఉగ్రవాద నిర్మూలనలో ప్రధాని భేష్ :కిషన్ రెడ్డి

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేలా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. నీతి నిజాయితీతో 11 సంవత్సరాలపాటు సమర్ధవంతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. శనివారం హైదరాబాద్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి అందరికీ తెలుసన్నారు. దేశంలో అనేక మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. మోడీ 75వ జన్మదినోత్సవ ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ‘స్వచ్ఛతా హి సేవ‘ అంటే ‘పరిశుభ్రతే సేవ‘ అని అర్థం. ఇది భారతదేశం యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద,
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రారంభించబడిన ముఖ్యమైన ప్రచారం. ఈ ప్రచారం ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి , పరిశుభ్రత పట్ల అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. ప్రతి సంవత్సరం ఈ ప్రచారం చేపడతారు. దాని లక్ష్యం స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజూ దేశం కోసం, ప్రజల కోసం నరేంద్ర మోదీ పని చేస్తున్నారన్నారు. పేద కుటుంబం లో పుట్టిన ఆయన పదవీ వ్యామోహం లేకుండా 24 సంవత్సరాలుగా దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్లుగా పని చేస్తున్నారని అన్నారు. స్వచ్ఛతా హి సేవా ద్వారా ఆయన అంకిత భావాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుఉంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు మంత్రి కిట్ లను పంపిణీ చేసిన అనంతరం వారిని సత్కరించారు.
-
Home
-
Menu