కోదాడలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

X
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దొరకుంట గ్రామ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 42 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతులలో ఐదుగురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.
Tags
Next Story
-
Home
-
Menu
