సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కోహ్లీ

X
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. విరాట్‌కు అలయ అధికారులు, పూజారాలు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనం అందజేసి స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు ఇచ్చారు. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. సపారీలపై టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్‌లో జైస్వాల్ సెంచరీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లా హాఫ్ సెంచరీలు చేయడంతో గెలుపొందింది. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కగా యశస్వి జైస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
Next Story
-
Home
-
Menu
