మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలి

జాతర సమయాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి
ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను ముందస్తుగా సరి చేసుకోవాలి
కలెక్టర్ హైమావతి ఆదేశం
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కొమురవెళ్లి మల్లికార్జునస్వామి బ్ర హ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆలయ అధికారులకు సూచించారు. కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం కొమురవెల్లి నందు తేదీ 14 డిసెంబర్ 2025 ఆదివారం రోజున ఉదయం 10:45 నిమిషాల కు స్వామి వారి కళ్యాణం నిర్వహించబడి 18 జనవరి 2026 నుండి 16 మార్చి 2026 వరకు ప్రతి ఆదివారం, బుధవారంలలో జాతర అ త్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జాతరకు జిల్లా నుండే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖలకు సమన్వయంతో ముందస్తు ఏర్పాటు చేయాలని, జాతర జరిగినన్ని రోజులు శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
ఈ సారి మేడారం జాతర కూడా ఉన్నందున అక్కడికి వెళ్లే భక్తులు, అక్కడి నుండి దర్శనం చేసుకొని వచ్చే భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఎలాంటి అంచనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మా నిటరింగ్ చేయాలని, పార్కింగ్, బ్యారికెడింగ్ చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ లో మైకుల ద్వారా అవసరమైన విషయాలను అనౌన్స్ చేయాలని, లడ్డు కౌంటర్ లను మరింత పెంచి భక్తులు ఒకే చోట గుమి కాకుండా చూడాలని, భక్తుల క్యూ లైన్ ను సరిగా మైంటైన్ చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం సమయంలో రద్దీ కలుగకుండా వివిధ ప్రాంతాలలో అన్నదానం చేయాలని, విధులు నిర్వహించే సిబ్బందికి భోజన వసతి ఎక్కడికక్కడే ఏర్పా టు చేయాలన్నారు.
శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్ ద్వారా నిర్మాణంలో ఉన్న వివిధ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను ముందస్తుగా సరి చేసుకోవాలని, అదనంగా అవసరమైన ట్రా న్స్ఫార్మర్లను సమకూర్చాలని అన్నారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలతో పాటు సాధారణ వైద్య సేవలు అందించుటకు మెడికల్ క్యాంప్ ల ను ఏర్పాటుచేసి వైద్య సిబ్బందిని 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులను, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.
జాతర జరిగే అన్ని రోజులు పారిశు ద్ధ్యం అతి ముఖ్యమైనదని అవసరమైన సంఖ్యలో సానిటేషన్ సిబ్బందిని నియమించుకొని మూడు షిఫ్టులలో శానిటేషన్ కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని, త్రాగునీరు సమస్య రాకుండా అవసరమైన ఏ ర్పాట్లు చేయాలని, మద్యం అమ్మకాలు జరుగకుండా చూడాలని, ట్రా ఫిక్ సమస్య కాకుండా ఆర్టీసీ బస్సులను రూట్ల వారీగా నడపాలని, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని, అగ్నిమాపక యం త్రా లు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు క లెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, హుస్నాబాద్ ఏసీబీ సదానందం, ఆలయ ఈవో వెంకటేశ్వర్, కొమురవెల్లి సిఐ, ఎక్సైజ్ సూ పరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ధన్ రాజ్, డిపిఓ విజయ్ కుమార్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, టీజీఎస్‌ఆర్టిసి, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
