రైతు ప్రాణం తీసిన కోతులు

రైతు ప్రాణం తీసిన  కోతులు
X

రాజన్నసిరిసిల్ల: ఇంటిపై ఉన్న కోతులను తరిమి క్రమంలో ఓ రైతు కిందపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటిపైకి కోతులు రావడంతో వాటిని వెళ్లగొడుతుండగా అవి ఆయన పైకి దూసకరావడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సద్దుల బతుకమ్మ రోజు రైతు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. కోతుల బెడదకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story