మీడియా ముందు మీసాలు మెలేసిన కొండా మురళి

ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు
మాకు పదవులు ఉన్నా లేకపోయినా మా
గౌరవం మాకు ఉంటుంది సోషల్ మీడియా
వేదికగా ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరూ తట్టుకోలేరని, ఈ రోజు మేం ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు ఇంకెవరికి ఎదురవుతాయో అంటూ పరోక్షంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా మురళి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మాకు పదవులు ఉన్నా లేకపోయినా మా గౌరవం మాకు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి విషయానికి మేం వెంటనే స్పందించకపోవచ్చు, కానీ, జరుగుతున్న ప్రతి ఒక్క పరిణామాన్ని లోతుగా గమనిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. అన్ని దరిద్రాలు ఒక్కటై మాపై కుట్రపూరితంగా రాజకీయ దాడులు చేశాయన్నారు. కానీ, మేం దేనికి భయపడేది లేదని ఆయన అన్నారు.
ఎంతటి కష్టానైనా దృఢంగా నిలబడి తట్టుకుంటామని, మొండిగా ఎదురువెళ్తామని ఆయన ఎక్స్‌లో తెలిపారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా మురళి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రివర్గ ప్రక్షాళన, బర్తరఫ్ పరిణామాల అనంతరం ఆయన తొలిసారిగా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగ, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్దకు విలేకరులు వెళ్లినప్పుడు కొండా మురళీ మీసాలు మెలివేస్తూ మీడియా ఎదుట చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.
Tags
-
Home
-
Menu
