కొండా కుటుంబం జోలికొస్తే.. మహిళలే కొడతారు

ప్రభుత్వ లోపాలను విపక్షాలు ఎత్తి చూపే అవకాశం ఇవ్వకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మాజీ మంత్రి కొండా సురేఖ తూర్పు నియోజకవర్గ నాయకులకు సూచించారు. విపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, నిరసనలు చేయడం బాధాకరమన్నారు. కొండా కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని మా వద్ద ఉన్న మహిళలే ఉరికించి కొడతారని హెచ్చరించారు. మంగళవారం ఓ సిటీలో 111 మందికి రూ.61,61,200 సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందన్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎనిమిది అంతస్తుల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన కలెక్టరేట్ భవనం పనులు కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఆలస్యమవుతున్నాయని, త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 99 శాతం దేవాలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే నిధులు కేటాయించినట్లు చెప్పారు. వరంగల్ కోటలో వెలుగుచూసిన 11 దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
