కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి

X
Kondagattu Anjaneya Swamy Temple
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హనుమాన్ విజయోత్సవ దినం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తులపై చలువ పందిరి కూలడంతో 15 మంది గాయపడ్డారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
